నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద ఉద్ధృతి

52பார்த்தது
కృష్ణానది ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో మాచర్ల మండలం నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు శనివారం 26 రేడియల్ ట్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగు గేట్లు 10 అడుగుల ఎత్తు మేరకు, మిగిలిన 22 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 2, 35, 150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం 589 అడుగులకు చేరుకుంది.

தொடர்புடைய செய்தி