గురజాల:తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
దాచేపల్లి నగర పంచాయతీలో రాజకీయ కారణాలతో తొలగించిన మున్సిపల్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు.శనివారం కార్మికులు సమ్మెకు పిలుపునిస్తూ సంబంధిత సమ్మె నోటీసు మున్సిపల్ కమిషనర్ కి అందజేశారు. రాజకీయ కారణాలతో పేద కార్మికులను తొలగించడం సరైనది కాదు.అధికారులు నిర్లక్ష్యంవీడి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేనియెడల సమ్మె తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.