రెంటచింతల: టీడీపీ మహిళా నేతకు కీలక పదవి
ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కల్చరల్ సొసైటీ ఛైర్ పర్సన్ గా రెంటచింతల మండలానికి చెందిన మంజులా రెడ్డి శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గత ఎన్నికల్లో మంజులారెడ్డి టీడీపీ విజయంలో రెంటచింతల మండలం నుంచి కీలక పాత్ర పోషించారు. ప్రాణాలను పణంగా పెట్టి వైసీపీ దాడులను ధైర్యంగా ఆమె ఎదుర్కొన్నారని టీడీపీ శ్రేణులు తెలిపాయి.