గుంటూరు హైవేపై వాహనాల తనిఖీ

77பார்த்தது
గుంటూరు నగర శివారు జాతీయ రహదారిపై వీఐపీ రోడ్డు సమీపంలో రవాణా శాఖ అధికారులు శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు. జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి ఆదేశాల మేరకు ఎంవీఐ సౌజన్య పలు రకాల వాహనాల పత్రాలను పరిశీలించారు. ముఖ్యంగా బీమా (ఇన్సూరెన్స్) లేని వాహనాలు గుర్తించి అపరాధ రుసుము విధించారు. బీమా లేని వాహనాలకు రూ. 2 వేలు నుంచి పైగా ఫైన్ వేసినట్లు సౌజన్య తెలిపారు.

தொடர்புடைய செய்தி