ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఆయిల్ తయారీ యూనిట్ ని వినియోగంలోకి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం గుంటూరు కేవీపీ కాలనీలోని వెహికల్ షెడ్, విద్యానగర్ ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనాలన్నిటికీ 24 గంటల్లో మరమ్మతులు చేయాలన్నారు. విద్యానగర్లో పార్కులో పిల్లల ఆట వస్తువులు, ట్రాక్ మరమ్మతులకు చర్యలు తీసుకోవాలన్నారు.