గుంటూరు: పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవడం లేదు

61பார்த்தது
రాష్ట్రంలో పోలీసులు చట్టప్రకారం నడుచుకోవడంలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన సోషల్ మీడియా కార్యకర్తలు వెంకటరామిరెడ్డి, రవికిరణ్ ను బుధవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలపై అసభ్య పోస్టులు పెడుతుంటే పోలీస్ అధికారులు ఆనంద పడుతున్నారని అన్నారు. వైసీపీ శ్రేణులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు విడుదల రజిని కేసు పెడితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி