ప్రజలు ఇస్తున్న అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులకు సూచించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 211 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. అనంతరం పెండింగ్ దరఖాస్తులను కలెక్టర్ శాఖల వారీగా సమీక్షించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పాల్గొన్నారు.