కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని చంద్రశేఖర్ మొదటిసారిగా అమెరికాలోని డల్లాస్ లో ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు నిర్వహించిన అభినందన సభకు సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ డల్లాస్ లో ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు చూపించిన ఆత్మీయత తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు ఏపీలో వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు సాయం అందించారని తెలిపారు.