గుంటూరు నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలిపే డొంకరోడ్డు మూడు వంతెనల మార్గం సోమవారం మూత పడింది. రైల్వేలైన్ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా 2 నెలల పాటు ఈ మార్గాన్ని మూసివేస్తున్నట్లు జీఎంసీ కమిషనర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రహదారి మూత పడటంతో వాహనాలన్నీ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వైపు మళ్లించారు. రహదారి మూతపడిన విషయం తెలియక కొందరు ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు.