తెరుచుకొని గృహ నిర్మాణ శాఖ తలుపులు

77பார்த்தது
తెరుచుకొని గృహ నిర్మాణ శాఖ తలుపులు
కొరిశపాడు లోని మండల పరిషత్ కార్యాలయం నందు గృహ నిర్మాణ శాఖ కార్యాలయం తలుపులు బుధవారం ఉదయం 10: 30 గంటల దాటిన తెరవలేదు. అధికారులు, సిబ్బంది సమయానికి కార్యాలయానికి రావాలనే నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ పాటించడం లేదు. దీంతో గృహ నిర్మాణ పనులు నిమిత్తం వచ్చిన ప్రజలు పడి కాపులు కాయ వలసిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி