కొరిశపాడు మండల పరిధిలోని, అన్ని గ్రామ పంచాయతీలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 కోట్ల 80 లక్షలు మంజూరు చేసిందని, మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. రవికుమార్ తెలియజేశారు. అందులో భాగంగా మండల పరిధిలోని పమిడిపాడు గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి స్వయంగా శంకుస్థాపన చేశారు.