వరదల్లో నష్టపోయిన 2 వీలర్స్ కి రూ. 3 వేలు, ఆటోలకి రూ. 10 వేలు, తోపుడు బళ్ళు ఎంత రేటు అయినా కొత్తవి కొనిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఆయన తాడికొండ మండలం వెలగపూడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. టూ వీలర్స్ కు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నందుకు ఇప్పటికే అవకాశం కల్పించామన్నారు. ఈ సమస్య సెటిల్ అయ్యే వరకు దీనిపై ప్రతిరోజు నివేదిక తీసుకుంటానని సీఎం చంద్రబాబు చెప్పారు