గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని గ్రామాలలో రాజీనామాలు చేసిన సుమారు 100 మంది వాలంటీర్లు ఆదివారం పొన్నూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ కార్యాలయంలో అంబటిని కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఎన్నో అవమానాలు, నిందలు భరించలేక తాము స్వచ్ఛందంగా రాజీనామాలు చేసినట్లు మీడియాకు తెలిపారు. రాబోయే రోజుల్లో జగనన్న కోసం పనిచేసి తిరిగి వాలంటీర్లుగా చేరి ప్రజాసేవ చేస్తామని తెలిపారు.