ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని పొన్నూరు ఎక్సైజ్ ప్రొహిబిషన్ సీఐ రమేష్ బాబు అన్నారు. బుధవారం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇవాల్టితో దరఖాస్తుల గడువు పూర్తి కానుండగా 11వ తారీకు వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. పొన్నూరు ఎక్సైజ్ పరిధిలోని 12 షాపులకు 11వ తారీకు వరకు ఆన్లైన్ ఆఫ్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించబడునని తెలిపారు.