భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తు తీగలు తెగితే వెంటనే 1912 లేదా 9440817526 నెంబర్ కు ఫోన్ చేయాలని గుంటూరు సర్కిల్ పర్యవేక్షక ఇంజినీరు కేవీఎల్ఎన్ మూర్తి సోమవారం తెలిపారు. ఇందుకోసం 24 గంటలు పనిచేసే విధంగా విద్యుత్తు భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ గదిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తడిచిన స్తంభాలను తాకొద్దని సూచించారు. గృహాల్లో విద్యుత్తు ఉపకరణాలు వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.