గుంటూరు లో మంగళవారం దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నగరంపాలెం స్టేషన్ పరిధిలోని శ్రీనివాసరావుపేటలో వివాహేతర సంబంధం కొడుకు దారుణ హత్యకు దారి తీసింది. పోలీసుల వివరాలు ప్రకారం సుభాని తల్లి జరీనా బేగంతో బాజీ అనే వ్యక్తి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడని ఈ విషయమై సుభానికి, బాజీ కి మధ్య తరచూ గొడవలు కారణంగా ఎలాగైనా సుభాని ని అడ్డు తొలగించాలని బాజీ, జరీనా బేగం మద్యం మత్తులో ఉన్న సుభాని పై రోకలి బండతో దాడి చేశారు.