ఉప్పాకపాడులో బాల్య వివాహాలు నిరోధించాలని ర్యాలీ

61பார்த்தது
ఉప్పాకపాడులో బాల్య వివాహాలు నిరోధించాలని ర్యాలీ
ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్, కమ్యూనిటీ సోషల్ వర్కర్ చమటపల్లి రేఖ ఛైల్డ్ రైట్స్ అడ్వోకేసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం బాల్య వివాహాలు నిరోధించాలని ర్యాలీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు "బాల్యవివాహాలు నిరోధించండి" "పిల్లల హక్కులు కాపాడండి"అంటూ నినాదించారు. ఉపాధ్యాయులు అల్లు శ్రీను బాల్య వివాహాలను నిరోధించాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

தொடர்புடைய செய்தி