టి. నరసాపురం మండలం వెలగపాడుకు చెందిన యువతి ఇటీవల తల్లితో కలిసి అదే గ్రామానికి చెందిన వంశీకి చెందిన పత్తి చేలో పనికి వెళ్ళింది. దీంతో వంశీతో పరిచయం ఏర్పడిందని ఈ నేపథ్యంలో ఆమెను వంశీ శారీరకంగా అనుభవించాడన్నారు. పెళ్లి చేసుకోవాలని అడగడంతో వంశీ అతని కుటుంబ సభ్యులు యువతిపై దాడి చేసి కొట్టారన్నారు. ఈ మేరకు యువతి ఫిర్యాదుతో యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్సై జయ బాబు బుధవారం తెలిపారు.