ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.6కోట్లతో నూతనంగా నిర్మించనున్న సిసి రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు.