పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం బుధవారం పరిశీలించారు. ఈ ఏడాది జూన్ నెలలో ఐదు రోజుల పాటు పరిశీలన జరిపి పోలవరం ప్రాజెక్టులో మట్టి, రాతి నాణ్యత శాంపిళ్లు సేకరించిన విదేశీ నిపుణుల బృందం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాజెక్టును రెండోసారి పరిశీలిస్తోంది. బుధవారం ఉదయం పోలవరం చేరుకున్న విదేశీ నిపుణుల బృందం డయా ఫ్రామ్ వాల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సందర్శించారు.