పెనమలూరు: చూస్తుండగానే బ్యాంకు ఖాతాలో నగదు మాయం
పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఆన్లైన్ మోసంపై కేసు నమోదయింది. పోలీసుల వివరాల మేరకు కానూరుకు చెందిన లక్ష్మణ్ కుమార్ షేర్ మార్కెట్ వ్యాపారం కోసం యాప్ డౌన్లోడ్ చేసుకుని రూ.28లక్షల పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టిన అనంతరం లాభాలు తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తుండగా నగదు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.