ముసునూరులోని రమణక్కపేటలో మంగళవారం ఫిజియోథెరపీ క్యాంప్ జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వ్యాయామ చేశారు. పిల్లల తల్లిదండ్రులందరూ ఫిజియోథెరపీ పై అవగాహన కలిగి ఉండాలని కోరారు. మండల పరిధిలోని ఏడుగురు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వ్యాయామ చేసినట్లుగా తెలిపారు. టీచర్స్ సురేష్, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, నాగ మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.