అత్యవసర సమయాల్లో మహిళలు పోలీసుల సహాయం కోరే అభయ కార్యక్రమం పై అవగాహన కలిగి ఉండాలని నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ కోరారు. మంగళవారం ఆగిరిపల్లి జడ్పీ పాఠశాలలో విద్యార్థులతో కలిసి అభయ కార్యక్రమం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు 112 నంబర్ కాల్ ద్వారా పోలీసుల సహాయం కోరవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆగిరిపల్లి ఎస్ఐ శుభశేఖర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.