పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రూరల్ మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్తు నిర్వహణ పనుల నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ మధుకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్భరేవు, పీచుపాలెం, లక్ష్మణేశ్వరం, రాజలంక గ్రామాల్లో సరఫరా నిలిపివేయనున్నామని కావున విద్యుత్ వినియోగదారుడు సహకరించాలని కోరారు.