జంగారెడ్డిగూడెంలోని గురవాయిగూడెం రైతు భరోసా కేంద్రంలో రైతులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేసి, రైతులకు ఎటువంటి పథకాలు అయిన అందకపోతే సమాచార హక్కు చట్ట ప్రకారం దరఖాస్తు చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.