కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లి గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన మరీదు శ్రీనివాసు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 6 డ్యూటీ పైయిడ్ మద్యం సీసాలను స్వాధీన పరుచుకొని, అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని తహసీల్దార్ ఎదుట హాజరు పరచి బైండోవర్ చేశామన్నారు.