ప. గో. జిల్లా బీజేపీ క్రియాశీల సభ్యత్వ జిల్లా కార్యశాల కార్యక్రమం శుక్రవారం భీమవరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొని మాట్లాడారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నిర్వహిస్తున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం-2024ను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.