ఏపీలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. తొలుత విశాఖలో ఏర్పాటు తర్వాత.. రాష్ట్రం మొత్తం అమలులోకి రానున్నది. ఫోన్ మాదిరిగానే మీటర్‌కు రీఛార్జ్ చేయకపోతే చీకట్లోనే మగ్గిపోవాలి. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్‌ను APEPDCL, విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ మీటర్లను తొలుత ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి, ఆ తర్వాత గృహలకు ఏర్పాటు చేయనున్నారు.