ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్ అడపా రఘునాధరావు అధ్యక్షతన తునిలో వైద్యులు సమక్షంలో కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు ఆదివారం నిరసనగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ తుని ప్రభుత్వ ఆసుపత్రి నుండి జిఎన్టి రోడ్డు వరకు నినాదాలతో వెళ్లి సిబ్బంది అందరూ మానవహారాన్ని నిర్వహించి, నింధితులను శిక్షించాలన్నారు. ప్రభుత్వ వైద్యులకు భద్రత కల్పించాలని తెలిపారు. ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.