ఈనెల 14వ తేదీన రాజమండ్రిలోని ప్రభుత్వ శిక్షణ సంస్థ (ఐటీఐ) వద్ద ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్ఆర్ఆర్ కృష్ణన్ గురువారం తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అన్ని ట్రేడ్ ల విద్యార్థులు హాజరు కావాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి ఈ అప్రెంటిస్ మేళా ప్రారంభమవుతుందని వివరించారు.