రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో సాధారణ తనిఖీల్లో భాగంగా సౌత్ జోన్ డిఎస్పీ భవ్య కిషోర్ సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిలో భాగంగా స్టేషన్ లోనే రికార్డులను పరిశీలించారు. ప్రస్తుతం నడుస్తున్న కేసులు వాటి దర్యాప్తు పై వివరాలను సీఐ గణేష్ ని అడిగి తెలుసుకున్నారు.