రాజమండ్రి నగరంలోని శ్రీరామ్ నగర్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు పురస్కరించుకుని విశిష్ట చండీ హోమం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆయన కుమార్తె బత్తుల వందనాంబిక పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.