రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు గ్రామంలోఈ నెల ఆగస్ట్ 1వ తేది మంగళవారం సాయంత్రం షణ్ముఖపీఠం నందు పౌర్ణమి సందర్బంగా శ్రీచక్ర సహిత శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామివారి సన్నిధి యందు సామూహిక హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో షణ్ముఖ పీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి మాతాజీ భక్తులు పాల్గొన్నారు.