కడియం మండలంలో చిరుతపులి సంచారం ఉన్నందున రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ బుధవారం సూచించింది. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అటవీ శాఖ అధికారుల హెచ్చరికలను పరిగణలోకి తీసుకొని రెండు రోజులు మొక్కల లోడింగ్‌లు నిలిపి వేయాలని కోరింది. నర్సరీ యజమానులు ఈ సూచనలను పాటించాలని కోరింది.