రాష్ట్ర వ్యాప్తంగా డిఈఓలకు భారీ సంఖ్య లో స్థాన చలానాలు కలిగించినా తూ. గో జిల్లా డిఈఓగా కే. వాసుదేవ రావును కొనసాగించడం అభినందనీయమని తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కే. జయరాజు పేర్కొన్నారు. శనివారం ఆయనను రాజమండ్రిలో కడియం మండల విద్యాశాఖాధికారి ఎం. మణికుమారి, జయరాజు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత స్థాయిలో వీరి సేవలు గుర్తించడం వలనే ఇది సాధ్యమైందని అన్నారు.