బొమ్మూరులో ఉన్న బి. ఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నికల్ కళాశాలలో శనివారం, ఆదివారం టైప్ లోయర్ టెక్నికల్ ఎగ్జామ్స్ జరిగాయి. మొదటి బ్యాచ్ 8: 30 నుండి 10 గంటల వరకు రెండవ బ్యాచ్ 10 గంటల నుండి 11: 30 వరకు నిర్వహించారు. నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పరీక్షలకు పాల్గొన్నారు. అలాగే ఉద్యోగులు కూడా ప్రమోషన్ కోసం ఈ ఎగ్జామ్స్ లో పాల్గొన్నారు. స్టేట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ బోర్డు ఈ పరీక్షలను నిర్వహించింది. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా అందరూ మాస్ పెట్టుకుని వచ్చారు అధికార యంత్రాంగం ఎగ్జామ్ సజావుగా నిర్వహించారు.