తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారిగా సీహెచ్ లావణ్య రాజమండ్రిలోని ఆమె కార్యాలయం వద్ద సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఆమె 2010 నుంచి 2012 వరకు ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేసినట్లు తెలిపారు. ఆపై ఎక్సైజ్ శాఖలో శిక్షణ పొందిన తర్వాత ఎక్సైజ్ శాఖలోకి పదోన్నతి పొంది వచ్చానన్నారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.