మద్యం తాగి వాహనాలు నడిపిన 23 మందికి పిఠాపురం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. విజయరామేశ్వరి జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. ఇటీవల పిఠాపురం పట్టణ పోలీసులు రాత్రివేళల్లో తనిఖీలు నిర్వహించగా 23 మంది తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి కేసులు నమోదుచేశారు. శనివారం కోర్టులో హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జరి మానా విధించారని పట్టణ ఎస్సై మణికుమార్, కోర్టు కానిస్టేబుల్ కరీం తెలిపారు.