జగ్గంపేట మండలం మల్లిశాల, పెద్దాపురం మండలం కొండపల్లి, మర్లావ, తూర్పుపాకలు గ్రామాల్లో బుధవారం దాడులు నిర్వహించి 5 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ అర్జునరావు తెలిపారు. 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని, ఒకరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటు సారా స్థావరాలపై ఉక్కు పాదం మోపామని పట్టుబడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.