మండపేట నియోజక వర్గంలో ఉన్న అన్ని రహదారులను అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు తెలిపారు. మండపేటలో శనివారం ఆయన మాట్లాడుతూ గత ఐదు ఏళ్ళుగా వైస్సార్సీపీ ప్రభుత్వ నిర్ల్యక్షంతో గుంతలుగా మారిన రోడ్లను మరమ్మతులు చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రారంభించిన గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మండపేట నుంచి వల్లూరు అర్అండ్ బి రోడ్డు గుంతలు పూడ్చే పనులను ప్రారంభించినట్లు చెప్పారు.