గత 13 ఏళ్ళగా పాలక వర్గాలు లేని తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట గ్రామాలను కాకినాడ కార్పొరేషన్ లో వెంటనే విలీనం చేసేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్ డిమాండ్ చేసారు. సిపిఎం పార్టీ సెంటర్ శాఖ సమావేశం కె. సింహాచలం అధ్యక్షతన ఆదివారం సుందరయ్య భవన్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఆరు గ్రామాలను విలీనం చేయాలన్నారు.