జగ్గంపేట మండలం కాట్రావులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో మంగళవారం మహిళా చట్టాలు, హక్కులు, బాల బాలికల రక్షణ పట్ల జగ్గంపేట ఎస్ఐ రఘునాధరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు, జగ్గంపేట సీఐ శ్రీనివాస్ హాజరయ్యారు. గుడ్ టచ్, బాడ్ టచ్, సైబర్ నేరాలు, రాగింగ్, రోడ్డు భద్రత, బాల్య వివాహాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు.