పెదపూడి మండలం దోమడ గ్రామ సచివాలయంను శనివారం మండలం ఎంపీడీవో కే నరేందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంపీడీవో సచివాలయం సిబ్బందితో మాట్లాడుతూ అందరూ టైంకి రావాలని, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన అన్నారు. పంచాయతీ కార్యదర్శి కృష్ణారెడ్డి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.