పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం నాకు ఎంతో ఇష్టమని,ఈ గ్రామం ఆధ్యాత్మిక భావన కలిగిన గ్రామమని,భవానిల మాల ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందే గొప్ప జీవన విధానం పొందవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు.