రాష్ట్రంలో టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో కొన్ని రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గురువారం రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి, గండికోటలో పెట్టుబడులకు ఒబెరాయ్ సంస్థను ఆకాంక్షించమని అన్నారు.