అమెరికా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ మేరకు టెస్లా సీఎఫ్వో వైభవ్ తనేజాతో లోకేశ్ సమావేశమయ్యారు. ‘ఈవీ’ ప్లాంట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా అనువుగా ఉంటుందని, ఏపీలో టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్, సూపర్ ఛార్జింగ్ టెక్నాలజీ అమలులో సహకారం కోరారు. ఈ మేరకు ఏపీకి రావాలని టెస్లా సీఎఫ్వోను మంత్రి ఆహ్వానించారు.