వెంకటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు విద్యార్థినీ విద్యార్థులకు వృత్తి విద్య అయిన ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంటర్న్ షిప్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణ రెండవ రోజున కూడా కొనసాగింది. పాఠశాల వృత్తి విద్య ఉపాధ్యాయులు హరీష్ మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సుమారు 170 మంది విద్యార్థులలో 80 మంది ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్యను ఎంచుకున్నారన్నారు.