తిరుపతిలోని రుయా, మెటర్నటి, స్విమ్స్ ఆసుపత్రులలో గత రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులర్ చేయాలంటూ శనివారం అలిపిరి, రుయా ఆస్పత్రి, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రాంతాలలో ర్యాలీగా నిరసన తెలుపుతూ డిమాండ్ చేశారు. విధుల నుండి రోడ్డు పైకి వచ్చి వారి నిరసన వ్యక్తం చేశారు. నిరసన అనంతరం వారి వారి విధులకు తరలి వెళ్లారు.