క్యాన్సర్తో పోరాడుతున్న తన అభిమానికి శనివారం ఎన్టీఆర్ వీడియో కాల్ చేశాడు. అతడికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పాడు. కాగా, తిరుపతికి చెందిన కౌశిక్ (19) కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. తాను చనిపోయేలోపు ‘దేవర’ చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు ఇటీవల చెప్పిన వీడియో వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించారు.