రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుచ్చినాయుడు కండ్రిగ సీఐ తిమ్మయ్య ఆదివారం హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సిబ్బందికి తగు సూచనలు చేశారు. ప్రజలందరూ అధికారుల సూచనలు తప్పక పాటించాలని సూచించారు.